యాదాద్రి భువనగిరి : సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అంతా రియల్ ఎస్టేట్ పైనే ఉంది. యాదాద్రి అభివృద్ధి కోసం సేకరించిన 1200ఎకరాల భూమిపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి(Sunitha Mahender Reddy )విమర్శించారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రూ.1300కోట్లతో అద్భుతంగా యాదాద్రి ఆలయాన్ని పునః నిర్మాణం చేశారు.
అలాంటి దేవాలయాన్ని ఏమి చేద్దాం అని ఇక్కడికి వస్తున్నారో చెప్పాలన్నారు. యాదాద్రి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కోట్లు కేటాయిస్తారో స్పష్టం చేయాలన్నారు.తాను చేసిన పాపాలు, తప్పులు తొలగాలని రేవంత్ రెడ్డి కోరుకోవాలన్నారు. యాదాద్రి విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం 125కిలోలు అవసరమని కేసీఆర్ నిర్ణయించారు. అయితే దాతలు, భక్తులు ఇచ్చిన బంగారం, నగదు ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయనే అంశంలో స్పష్టత లేదన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.