IPL 2025 : భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) ఐపీఎల్లో రికార్డు సృష్టించాడు. పంజాబ్ కింగ్స్(Punjab Kings) తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర లిఖించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ వికెట్ తీసి 85 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ ఎడమ చేతివాటం పేసర్ పీయూష్ చావ్లా(Piyush Chawla) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు.
సీనియర్ స్పిన్నర్ అయిన చావ్లా 2008 నుంచి 2013 వరకూ పంజాబ్‌కు ఆడాడు. అతడు 7.52 ఎకానమీతో 84 వికెట్లు పడగొట్టాడు. అయితే.. చావ్లా 87 మ్యాచులు తీసుకుంటే.. అర్ష్‌దీప్ కేవలం 72 మ్యాచుల్లోనే 85 వికెట్లు తీశాడు. పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లో అర్ష్‌దీప్ అగ్రస్థానంలో ఉండగా.. చావ్లా రెండుకు పడిపోయాడు. సీనియర్ పేసర్ సందీప్ శర్మ 73 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 61 వికెట్లు తీసిన అక్షర్ పటేల్, 58 వికెట్లు పడగొట్టిన షమీ వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు.
ARSHDEEP SINGH COMING CLUTCH FOR PBKS. 👏pic.twitter.com/k4xMaOS0NC
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2025
ఐపీఎల్లో అదరగొడుతున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్లలో ఒకడైన అర్ష్‌దీప్ 2019 నుంచి పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్నాడు. లైన్ అండ్ లెంగ్త్తోవికెట్లు తీసే.. అతడు ప్రస్తుతం ఆ జట్టు ప్రధాన పేసర్‌గా రాణిస్తున్నాడు. పవర్ ప్లే, డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా పేరొందిన ఈ పంజాబీ కుర్రాడు పంజాబ్‌కు బౌలింగ్ యూనిట్‌కు వెన్నెముకలా మారాడు.