Kotha Prabhakar Reddy | చేగుంట, ఏప్రిల్18: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నార్సింగి మండల కేంద్రంలోని సహకారం సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మండలంలోని పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించాలని అన్నారు. ఎక్కువ తరుగు లేకుండా డబ్బులు తొందరగా వచ్చే విధంగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో నార్సింగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైలారం బాబు, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ చిందం సబితా రవీందర్, బాణపురం కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, సీవో నర్సింహులు, స్వామి, డైరెక్టర్లు సిద్ధి రాములు, మల్లమ్మ ఎల్లయ్య, బీక్యా నాయక్, సత్యం, చిన్య, శ్రీపతిరావు, ఆకుల మల్లేశం గౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, భూపతి, లాలు, వాయిద్, ఇండ్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చెప్యాల మల్లేశం, శ్రీనివాస్, బొమ్మగారి సత్యం,తహసీల్దార్ కరీం తదితరులున్నారు.