IPL 2025 : వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు చెలరేగుతున్నారు. దాంతో, ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోతోంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(4), విరాట్ కోహ్లీ(1)లు పెవిలియన్ చేరారు. ఆ కాసేపటికే లివింగ్‌స్టోన్(4)ను బార్ట్లెట్ ఔట్ చేశాడు. ప్రస్తుతం కెప్టెన్ రజత్ పాటిదార్(17), జితేశ్ శర్మ లు ఆడుతున్నారు. పవర్ ప్లేలో ఆర్సీబీ స్కోర్.. 26-3.
టాస్ ఓడిన ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. చిన్నస్వామిలో తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న బెంగళూరును అర్ష్‌దీప్ సింగ్ దెబ్బకొట్టాడు. అతడు తొలి ఓవర్లో బౌండరీ బాదిన అదే ఓవర్లో ఫిలిప్ సాల్ట్(4) వికెట్ కీపర్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్(17) ధాటిగా ఆడాడు. అర్ష్‌దీప్ మరోసారి ఆర్సీబీకి షాకిస్తూ.. విరాట్ కోహ్లీ(1)ని పెవిలియన్ పంపాడు.
2️⃣ sharp catches 🫡
2️⃣ early strikes ✌Arshdeep Singh and #PBKS with a solid start ⚡
Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/jCt2NiuYEH
— IndianPremierLeague (@IPL) April 18, 2025
కోహ్లీ లాంగాన్‌లో కొట్టిన బంతిని యాన్సెన్ పరుగెడుతూ వెళ్లి అందుకున్నాడు. ఈ సీజన్లో పెద్దగా రాణించని లివింగ్‌స్టోన్(4) ఒక బౌండరీతో టచ్‌లో ఉన్నట్టే కనిపించాడు. కానీ, బార్ట్లెట్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.