IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది. వర్షం అంతరాయం కారణంగా టాస్ మరింత ఆలస్యం అయ్యేలా అనిపించింది. అయితే.. చిన్నస్వామి స్టేడియం సిబ్బంది ఔట్‌ఫీల్డ్‌ను త్వరితగతిని సిద్ధం చేశారు. దాంతో 9:30 గంటలకు టాస్ వేశారు. టాస్ గెలుపొందిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
చిన్నస్వామి మైదానంలో జోరు వాన కారణంగా టాస్ ఆలస్యమైంది. రాత్రి 7 గంటల నుంచి వాన పడడంతో మ్యాచ్ అసాధ్యం అనిపించింది. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే 10:41కి టాస్ వేసి.. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరపాలని అంపైర్లు, రిఫరీభావించారు. అయితే.. రెండున్నర తర్వాత మ్యాచ్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉండడంతో టాస్కు ఓకే చెప్పారు. దాంతో, 9:30 గంటలకు టాస్ పడింది. 14 ఓవర్ల మ్యాచ్ నిర్వహిస్తారు. పవర్ ప్లేలో 4 ఓవర్లు ఉంటాయి. ముగ్గురు బౌలర్లకు మూడు ఓవర్లు.. ఒక బౌలర్‌కు నాలుగు ఓవర్లు వేసేందుకు అనుమతిస్తారు.
Good news from Bengaluru, folks!
Toss at 9:30 PM IST.
First Ball at 9:45 PM IST.
1⃣4⃣ overs per side. #TATAIPL | #RCBvPBKS https://t.co/ji4xNo1q3E— IndianPremierLeague (@IPL) April 18, 2025
ఆర్సీబీ తుది జట్టు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్.
ఇంప్యాక్ట్ సబ్స్ : దేవ్‌దత్ పడిక్కల్, రసిక్ దార్ సలాం, మనోజ్ భాండగే, జాకబ్ బెతెల్, స్వప్నిల్ సింగ్.
&
Matchday Mode 🔛
No.3⃣ 🆚 No.4⃣
Which red are you wearing tonight?
Updates ▶ https://t.co/7fIn60qSVr #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/daIIBBfXkF
— IndianPremierLeague (@IPL) April 18, 2025
పంజాబ్ తుది జట్టు : ప్రియాన్ష్ ఆర్య, నేహల్ వధేరా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), స్టోయినిస్, మార్కో యాన్సెస్, హర్‌ప్రీత్ బ్రార్, గ్జావియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్.
ఇంప్యాక్ట్ సబ్స్ : ప్రభ్‌సిమ్రన్ సింగ్, విజయ్‌కుమార్, సూర్యాన్ష్ షెడ్గే, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్రవీణ్ దూబే.