హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): భాషా పండితుల ప్రయోజనాలకు అడ్డంకిగా ఉన్న 1/2005 యాక్ట్‌ను రద్దుచేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ (ఆర్‌యూపీపీటీ) డిమాండ్ చేసింది. నియామక తేదీ నుంచే నోషనల్ సీనియారిటీని లెక్కించాలని కోరింది. ఈ మేరకు బుధవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి జీటీ కాంతికృష్ణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఉచిత బీమా కల్పించాలి : టీఎస్సీపీఎస్ఈయూ
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్)లో రిటైర్డ్ సీపీఎస్ ఎంప్లాయీస్‌కు 1.5 శాతం చందా వసూలు అసాధ్యమని, వీరికి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని టీఎస్ సీపీఎస్ఈయూ డిమాండ్ చేసింది. రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ అమలుపై స్పష్టత కరువైందని పేర్కొన్నది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు.