RTC Bus Accident | గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున అదుపుతప్పిన బస్సు గుంతలో పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి కాళ్లు, చేతులు విరిగినట్లు సమాచారం. బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనాల్లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
1. సుబ్బారాయుడు (45 సంవత్సరాలు)
గాయం: రెండు భుజాలలో తీవ్రమైన నొప్పి (Severe shoulder pain)
2. అరుణ (45 సంవత్సరాలు)
గాయం: పెల్విక్ ఎముకల ప్రాంతంలో తీవ్రమైన నొప్పి (Severe pelvic bone pain)
3. మోహన్ రెడ్డి (63 సంవత్సరాలు)
గాయం: తల యొక్క టెంపరల్ ప్రాంతంలో వాపు
ఎడమ చేయి/బాహువులో వాపు
4. రామేశ్వరమ్మ (45 సంవత్సరాలు)
గాయం: ఎడమ చేతి వేళ్లలో కోత గాయం (Laceration)
5. రంన్న (28 సంవత్సరాలు)
గాయం: కుడి చేతి మణికట్టు ఫ్రాక్చర్
6. శివ(24 సంవత్సరాలు)
గాయం: ఎడమ చేతి మణికట్టు ఫ్రాక్చర్
7. వీరేశ్ (55 సంవత్సరాలు)
గాయం: కుడి చేతి మణికట్టు ఫ్రాక్చర్
8. గౌస్ (30 సంవత్సరాలు)
గాయం: బహుళ గీతలు / గాయాలు (Multiple abrasions)
9. సేనాత లత (23 సంవత్సరాలు)
గాయం: కుడి చెవి నుండి రక్తస్రావం, ఎడమ చేతి మణికట్టు ఫ్రాక్చర్
🚨 RTC Bus Accident Near Gadwal
An RTC bus traveling from Hyderabad to Ananthapur overturned near Gadwal.
Around 20 passengers sustained fractures and injuries. The injured have been shifted to a nearby hospital for treatment.#RTC #BusAccident #Gadwal #Telangana… pic.twitter.com/pjbgevZXwG
— Rathnam News (@RathnamNews) February 19, 2026