IND vs RSA : మూడో వన్డేలో భారత్ నిర్దేశించిన 297 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. తొలి వన్డేలో ఐదు వికెట్లతో సఫారీలను వణికించిన అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో రీజా హెండ్రిక్స్(19) ఔటయ్యాడు. అప్పటివరకూ ఎంతో జాగ్రత్తంగా ఆడిన రీజా కీపర్ రాహల్ చేతికి చిక్కాడు.
దాంతో, 59 పరుగుల వద్ద సఫారీ జట్టు తొలి వికెట్ పడింది. డస్సెన్ క్రీజులోకి వచ్చాడు. రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన డీ జోర్జి(33) ధాటిగా ఆడుతున్నాడు. 9 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్.. 59/1. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 238 పరుగులు కావాలి.
Arshdeep draws the nick and SA lose their first after a good start
Tune in to the 3rd #SAvIND ODI LIVE NOW | @StarSportsIndia pic.twitter.com/IRieJQ5CSa
— ESPNcricinfo (@ESPNcricinfo) December 21, 2023
సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ సంజూ శాంసన్(108 113 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత సెంచరీ బాదడంతో 8 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసింది. మూడంకెల స్కోర్ కోసం 8 ఏండ్లుగా నిరీక్షిస్తున్న శాంసన్ దక్షిణాఫ్రికా గడ్డపై తన కలను నిజం చేసుకోగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(52) సఫారీ బౌలర్లను దీటుగా
శాంసన్(108), తిలక్ వర్మ(52)
ఎదుర్కొని వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ బాదాడు. బ్యాటింగ్‌కు సహకరించిన పిచ్‌పై శాంసన్, రింకూ మొండిగా పోరాడారు. నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 116 పరుగులు జోడించారు. మొదట్లో నిదానంగా ఆడిన ఈ ఇద్దరూ కుదరుకున్నాక ధాటిగా ఆడి జట్టు స్కోర్ 200 దాటించారు. చివర్లో రింకూ సింగ్(38) వీరవిహారం చేయడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. సఫారీ బౌలర్లలో హెండ్రిక్స్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు.