Hero Sivaji : దండోరా సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల వస్త్రధారణపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు శివాజీ (Sivaji) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ (Women Commission) మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27 శనివారం ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు హాజరు అవ్వాలని నోటీసులు పంపింది.
దండోరా సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లపై, వారు ధరించే దుస్తులపై శివాజీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. హీరో మంచు మనోజ్, సింగర్ చిన్మయి.. యాంకర్, నటి అనసూయ, దర్శకుడు రామ్గోపాల్ వర్మ సహ పలువురు ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. మహిళలను అవమానించేలా మాట్లాడిన శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు పంపింది. కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని తెలిపింది. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ శివాజీ హీరోయిన్లకు క్షమాపణలు చెప్పారు.
నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు
ఈ నెల 27 ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు హాజరు అవ్వాలని నోటీసులు
నిన్న దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో నటుడు శివాజీకి నోటీసులు పంపిన మహిళా కమిషన్ https://t.co/XB1d2Avbhj pic.twitter.com/1BsLjUFSZz
— Telugu Scribe (@TeluguScribe) December 23, 2025
సోమవారం జరిగిన దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ.. “స్త్రీ అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా (సామాన్లు కనిపించేలా) బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అని శివాజీ అన్నారు. అంతేకాదు హీరోయిన్లు పొట్టి బట్టలు వేసుకున్నప్పుడు బయటకు అందరూ పొగిడినా, లోపల మాత్రం అసహ్యించుకుంటారని చెబుతూ.. కొన్ని వివాదాస్పదమైన బూతు పదాలను (దరిద్రపు ము.. వంటివి) ఉదాహరణగా వాడారు. ఇప్పటి హీరోయిన్లు సావిత్రి, సౌందర్య వంటి మహానటులను స్ఫూర్తిగా తీసుకోవాలని, గ్లామర్ అనేది ఒక హద్దులోనే ఉండాలని ఆయన హితవు పలికారు. అయితే ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి.. యాంకర్, నటి అనసూయ శివాజీకి గట్టి కౌంటర్ ఇచ్చారు.
హీరోయిన్లకు క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ
నిన్న దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపడంతో క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ https://t.co/4QOKMKp5BR pic.twitter.com/1YGH34sVDN
— Telugu Scribe (@TeluguScribe) December 23, 2025
ఇది మా బాడీ.. మీది కాదు. మాకు నచ్చినట్లు మేం ఉంటాం అంటూ పోస్ట్ పెట్టింది అని ఎక్స్ వేదికగా అనసూయ పోస్ట్ పెట్టింది. మహిళలకు తమకు నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ ఉందని, వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం తప్పని శివాజీపై రామ్గోపాల్ వర్మ సైతం మండిపడ్డారు.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 23, 2025