Rajat Patidar | లక్కంటే మనోడిదే.. వన్డేల్లో అరంగ్రేటం రోజే 30 లక్షలు పట్టేశాడు
Rajat Patidar : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మొదలయ్యాక భారత జట్టుకు ఆడాలనుకున్న కుర్రాళ్ల కలకు రెక్కలొచ్చినట్టయింది. ఈమధ్య కాలంలో ఐపీఎల్లో చితక్కొడితే చాలు.. వికెట్ల వేట కొనసాగిస్తే చాలు ఒంటిమీదికి నీలి రంగు జెర్సీ వచ్చి వాలుతోంది. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) తరఫున నిలకడగా రాణించిన పాటిదార్..
Rajat Patidar : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మొదలయ్యాక భారత జట్టుకు ఆడాలనుకున్న కుర్రాళ్ల కలకు రెక్కలొచ్చినట్టయింది. ఈమధ్య కాలంలో ఐపీఎల్లో చితక్కొడితే చాలు.. వికెట్ల వేట కొనసాగిస్తే చాలు ఒంటిమీదికి నీలి రంగు జెర్సీ వచ్చి వాలుతోంది. సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav), యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal), రింకూ సింగ్(Rinku Singh), తిలక్ వర్మ(Tilak Verma).. వీళ్లంతా అలా జట్టులోకి వచ్చినవాళ్లే. తాజాగా ఈ లిస్ట్‌లో రజత్ పాటిదార్(Rajat Patidar ) చేరిపోయాడు.
ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) తరఫున నిలకడగా రాణించిన పాటిదార్.. దక్షిణాఫ్రికాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఈ రైట్ హ్యాండర్ మరో జాక్‌పాట్ కొట్టాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో అమాంతం రూ. 30 లక్షలు అదనంగా ఆర్జించనున్నాడు. అవును.. 17వ సీజన్లో ఆర్సీబీ యాజమాన్యం పాటిదార్‌కు రూ.50లు ముట్టజెప్పనుంది. ఎందుకో తెలుసా..?

ఐపీఎల్ సీజన్ల మధ్యలో భారత జట్టుకు ఆడిన క్రికెటర్లకు కనీసం రూ.50 లక్షలు ఇవ్వాలని బీసీసీఐ(BCCI) నియమం పెట్టింది. అందులో భాగంగానే పాటిదార్‌కు 17వ సీజన్‌తో అరకోటి అందుకోనున్నాడు. ఇప్పటివరకూ పాటిదార్‌కు ఆర్సీబీ రూ.20 లక్షలు ఇస్తూ వస్తోంది. బీసీసీఐ నిబంధనతో ‘క్యాప్డ్ ప్లేయర్'(Capped Player) అయిన ఈ స్టార్ బ్యాటర్‌కు బెంగళూరు 17వ సీజన్లో మరో రూ.30 లక్షలు కలిపి మొత్తంగా రూ.50 లక్షలు ఇవ్వనుంది.

ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో పాటిదార్ క్వాలిఫయర్ 1లో వేగవంతమైన సెంచరీ బాదాడు. ఈ సీజన్లో 8 మ్యాచుల్లో అతడు 55.50 సగుటుతో 333 రన్స్ కొట్టాడు. అయితే.. 16వ సీజన్‌కు ముందు గాయపడిన పాటిదార్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మధ్యే గాయం నుంచి కోలుకున్న పాటిదార్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలం డిసెంబర్ 19న ముగిసిన విషయం తెలిసిందే. త్వరలోనే టోర్నీ ఆరంభం తేదీ, మ్యాచ్‌ల వివరాలతో కూడిన షెడ్యూల్ రానుంది.
ఇవి కూడా చదవండి
- Sai dharam Tej | సినిమా గెలుస్తుంది.. సాయి ధరమ్ తేజ్ పోస్ట్ వైరల్
- SAINDHAV | డుకాటి బైక్‌పై ఆండ్రియా జెర్మియా.. సైంధవ్ టీం బర్త్ డే విషెస్ లుక్ వైరల్
- CBDT | రూ.351కోట్ల సొత్తు సీజ్‌పై సీబీడీటీ కీలక ప్రకటన..!
- Tragedy | విషాదం.. ప్రమాదవశాత్తు వాటర్సంప్లో పడి ఇద్దరు చిన్నారులు మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

