అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి(East Godavri) జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వాటర్సంప్లో దిగిన ఇద్దరు చిన్నారులకు ఊపిరి ఆడక మృత్యువాత పడ్డారు. జిల్లాలోని రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో గురువారం సాయంత్రం రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు కమ్మిలి జశ్వంత్(4), గెట్టం వినూత(3) ఆడుకుంటూ వాటర్సంప్ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ట్యాంక్లో పడి ఊపిరి ఆడక మృతి చెందారు.
తమ పిల్లల జాడ కనిపించడం లేదని పిల్లల తల్లిదండ్రులు గాలించగా చివరకు నీటి ట్యాంకులో కనిపించిన మృతదేహాలను చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.