INDS vs SLW : విశాఖపట్టణంలో రెండో మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడిన శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేస్తూ.. వికెట్ల వేట కొనసాగించారు. శ్రీ చరణి(2-23), వైష్ణవి శర్మ(2-32) రెండు వికెట్లతో మెరవగా.. లంక స్కోర్ 120కి మించలేదు. టీమిండియా స్పిన్నర్ల ధాటికి మిడిలార్డర్ కుప్పకూలగా సమరవిక్రమ(33), ఓపెనర్ చమరి ఆటపట్టు(31) రాణించారు. దాంతో.. పోరాడగలిగే స్కోర్ చేసేలా కనిపించిన లంకను వైష్ణవి, శ్రీచరణి నిలువరించారు. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి పర్యాటక జట్టు 128 పరుగులే చేసింది.
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే క్రాంతి గౌడ్ లంకకు షాకిచ్చింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ విష్మీ గుణరత్నే(1)ను రిటర్న్ క్యాచ్‌తో ఆమె పెవిలియన్ చేర్చింది. అనంతరం ఓవర్‌కు ఫోర్, సిక్స్ చొప్పున దంచేసిన చమరి ఆటపట్టు (31) దూకుడుగా ఆడే క్రమంలోస్నేహ్ రానా ఓవర్లో ఔటయ్యింది. మిడాన్‌లో పెద్ద షాట్ ఆడిన తనను అమన్‌జోత్ కౌర్ అద్భుత క్యాచ్‌తో డగౌట్ చేర్చింది.
Innings Break!
Another brilliant performance from the #TeamIndia bowlers 🙌👏
A 🎯 of 1⃣2⃣9⃣ and the chase is coming up! ⏳
Scorecard ▶️ https://t.co/Umn9ZGAexw#INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/B6Kw10Kn1f
— BCCI Women (@BCCIWomen) December 23, 2025
క్రాంతి, స్నేహ్ రానా విజృంభణతో లంక టీమ్ పవర్ ప్లేలోనే రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది. 38కే రెండు వికెట్లు పడిన వేళ.. హాసిని పెరీరా(22), హర్షిత సమరవిక్రమ(33)లు ధనాధన్ ఆడారు. వైష్ణవీ ఓవర్లో రెండుఫోర్లతో చెలరేగిన పెరీరాను శ్రీ చరణి వెనక్కి పంపింది. కాసేపటికే సమరవిక్రమ సైతం రనౌట్ కాగా లంక స్కోర్ వేగం తగ్గింది. నీలాక్షి డిసిల్వా(2)ను ఔట్ చేసిన వైష్ణవి తొలి టీ20 వికెట్ సాధించింది. ఆఖరి ఓవర్లో శషిని గిహ్మని(0)ని కూడా తనే ఔట్ చేసింది. దాంతో.. లంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేయగలిగింది.
That maiden wicket feeling 🥳
Updates ▶️ https://t.co/Umn9ZGAexw#TeamIndia | #INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/13Msn2mtml
— BCCI Women (@BCCIWomen) December 23, 2025