INDW vs SAW : వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మెరుపు అర్ధ శతకంతో టీమిండియా విజయంలో కీలకమైన షఫాలీ వర్మ(69 నాటౌట్) టీ20 సిరీస్‌లోనూ దంచేసింది. వైజాగ్ మైదానంలో మంగళవారం శ్రీలంక బౌలర్లను బెంబేలెత్తిస్తూ హాఫ్ సెంచరీతో చెలరేగింది. తనదైన స్టయిల్లో విధ్వంసం సృష్టించిన లేడీ సెహ్వాగ్ జట్టుకు భారీ విజయాన్ని అందించింది. స్వల్ప ఛేదనలో షఫాలీ మెరుపులతో ఏడు వికెట్ల తేడాతో లంకను టీమిండియా మట్టికరిపించింది. వరుసగా రెండో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
వైజాగ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ షోతో శ్రీలంకను వణికించింది. స్పిన్నర్లు తిప్పేసి ప్రత్యర్థిని 128కే కట్టడి చేయగా.. చిన్నపాటి లక్ష్యాన్ని షఫాలీ వర్మ (69 నాటౌట్) తన విధ్వంసక ఆటతో కరిగించేసింది. స్మృతి మంధాన(14) ఔటయ్యాక గేర్ మార్చిన తను.. బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించింది. ఆటపట్టు వేసిన ఆరో ఓవర్లో 4, 6, 4 బాది వైజాగ్ ప్రేక్షకులను అలరించింది. జెమీమా రోడ్రిగ్స్(26), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(10)తో కలిసి స్కోర్‌బోర్డును ఉరికించింది ఈ లెఫ్ట్ హ్యాండర్.
4⃣,6⃣,4⃣
🎥 Shafali Verma’s power on full display in the chase 💪
Updates ▶️ https://t.co/Umn9ZGAexw#TeamIndia | #INDvSL | @TheShafaliVerma | @IDFCFIRSTBank pic.twitter.com/7RkmQlWX8B
— BCCI Women (@BCCIWomen) December 23, 2025
కావ్య వేసిన పదో ఓవర్లో బౌండరీతో అర్ధ శతకం పూర్తి చేసుకుంది షఫాలీ. ఆ తర్వాత అదే ఊపులో గిహ్మని ఓవర్లో రెండు ఫోర్లు బాదింది హిట్టర్. విజయానికి ఒక్క పరుగు అవసరమైన వేళ మడర ఓవర్లో లెగ్‌సైడ్ షాట్ ఆడబోయిన హర్మన్ బౌల్డయ్యింది. ఆ తర్వాతి బంతికే రీచా ఘోష్(1 నాటౌట్) సింగిల్ తీయగా 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది.
టాస్ ఓడిన శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేస్తూ.. వికెట్ల వేట కొనసాగించారు. శ్రీ చరణి(2-23), వైష్ణవి శర్మ(2-32) రెండు వికెట్లతో మెరవగా.. లంక స్కోర్ 120 మించలేదు. టీమిండియా స్పిన్నర్ల ధాటికి మిడిలార్డర్ కుప్పకూలగా సమరవిక్రమ(33), ఓపెనర్ చమరి ఆటపట్టు(31) రాణించారు. దాంతో.. పోరాడగలిగే స్కోర్ చేసేలా కనిపించిన లంకను వైష్ణవి, శ్రీచరణి నిలువరించారు. ఫీల్డింగ్ కూడా బాగా మెరుగుపడడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి పర్యాటక జట్టు 128 పరుగులే చేసింది.