Arjun Erigaisi : చెస్ ఒలింపియాడ్‌లో మెరిసిన తెలంగాణ కుర్రాడు, గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగేసి (Arjun Erigaisi) మరో టైటిల్ కొల్లగొట్టాడు. వరల్డ్ నంబర్ 3 అయిన అర్జున్ డబ్ల్యూఆర్ చెస్ మాస్టర్స్ కప్ (WR Chess Masters Cup)లో విజేతగా అవతరించాడు. చదరంగంలో సంచలనంగా మారిన అర్జున్ శుక్రవారం లండన్‌లోని లాంగమ్ హోటల్లో ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో సత్తా చాటాడు.
వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ మాగ్జిమె వచీయర్ లాగ్రావేను చిత్తుగా ఓడించాడు. అర్జున్ ఎత్తులకు బిత్తరపోయిన వచీయర్ వరుసగా రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకున్నాడు. అయితే.. కీలకమైన మ్యాచ్‌లో అర్జున్ ప్రత్యర్థి ఆట కట్టించి చాంపియన్‌గా నిలిచాడు. అంతేకాదు తన తెలివికి బహుమతిగా అర్జున్ రూ.18 లక్షలు గెలుచుకున్నాడు. అయితే.. కెరీర్లో తొలిసారి ఈ వరంగల్ కుర్రాడు క్లాసికల్ చెస్‌లో 2,800 రేటింగ్ పాయింట్లు సాధించలేకపోయాడు.
Big congratulations to Arjun Erigaisi for winning the WR Chess Masters Cup 2024! In a very tense finals match where both the classical games were drawn, Arjun took down Maxime Vachier-Lagrave with the Black pieces in the Armageddon game.
What a performance by the India no.1… pic.twitter.com/htXA8pUYox
— ChessBase India (@ChessbaseIndia) October 17, 2024
క్లాసికల్ చెస్ పోటీలకు ముందు అర్జున్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. విజయంతో ఆరంభించి కచ్చితంగా 2,800 పాయింట్లు సాధిస్తాడని అనుకున్నారంతా. కానీ, మాగ్జిమో వచీయర్ నుంచి అతడికి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. అయితే.. ఫ్రాన్స్ ఆటగాడిని ఆత్మరక్షణలో పడేసిన అర్జున్ పైచేయి సాధించాడు. కానీ, 30 ఎత్తుల తర్వాత వచీయర్ అనూహ్యంగా పుంజుకొని మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. అఖరి మ్యాచ్‌లో గెలిచి టైటిల్ కొల్లగొట్టిన అర్జున్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.