డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీలోని (IIT Roorkee) హాస్టల్ మెస్‌లో ఎలుకల బెడద ఎక్కువైంది. కిచెన్‌లోని ఆహారంపై ఎలుకలు తిరుగడాన్ని విద్యార్థులు గమనించారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం భోజనం కోసం క్యాంపస్‌లోని రాధా-కృష్ణా భవన్ మెస్‌కు కొందరు విద్యార్థులు వెళ్లారు. ఆహారం తయారు చేసే వంటగదిలోని కుక్కర్‌తోపాటు పలు పాత్రల్లో ఎలుకలు ఉండటాన్ని చూశారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కలుషిత, పాడైన ఆహారాన్ని తమకు అందిస్తున్నారని ఆరోపించారు. ఇన్స్టిట్యూట్లో పాటించే ఆహార పరిశుభ్రత విధానాలను విద్యార్థులు ప్రశ్నించారు. అక్కడ నిరసన చేపట్టారు.
కాగా, ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు స్పందించారు. ఇలాంటి సంఘటనల కారణంగా యూనివర్సిటీ హాస్టల్‌ను వీడినట్లు ఒక విద్యార్థిని పేర్కొంది. ఇలాంటి వాటి వల్ల ప్రతిష్టాత్మక విద్యా సంస్థల గౌరవం దిగజారుతున్నదని మరొకరు విమర్శించారు. అలాగే పలు ఉన్నత విద్యా సంస్థల్లో జరిగిన ఇలాంటి సంఘటనలను మరి కొందరు విద్యార్థులు షేర్ చేశారు.
(2/6) Last night, the situation hit a new low when a student discovered rats roaming in cooking utensils, and sprouts scattered in drains. Shockingly, the same sprouts were served for breakfast this morning after being washed. pic.twitter.com/NkU6le6D6f
— Captain (@Captain16__) October 17, 2024