Vangalapudi Anitha | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పిపంచారు. రోజుకో అబద్ధం చెప్పి పెట్టుబడులు రాకుండా చూడాలని జగన్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. జగన్ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆమె అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్, నిమ్మల రామానాయుడుతో కలిసి హోంమంత్రి అనిత మాట్లాడారు. జగన్ కుట్రలన్నీ సమర్థంగా తిప్పికొడుతున్నామని తెలిపారు.
క్రమశిక్షణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని.. ఎవరు తప్పు చేసినా సహించరని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ స్పష్టం చేశారు. రైతు సంఘాలు, నీటి సంఘాలను వైసీపీ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రైతు ప్రాతినిధ్యంతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.