Akhil Next Movie | ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొమ్మిదేళ్లవుతున్నా ఇప్పటివరకు కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాడు అక్కినేని అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో తొలిహిట్ అందుకున్నా.. కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేకపోయిడు. దాంతో రెండేళ్లు గ్యాప్ తీసుకుని గత ఏడాది ఏజెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. తీరా రిలీజయ్యాక డిజాస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. పాత కథలనే రుబ్బి మళ్లీ చూపించాడనే మచ్చను సురేందర్ రెడ్డి తెచ్చుకున్నాడు. ఆయన స్టైల్ మేకింగ్ గానీ, విజన్ గానీ ఒక్క సీన్లోనూ కనిపించలేదు. ప్రేక్షకులనే కాదు.. అక్కినేని అభిమానులను సైతం ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.
ఇక రెండేళ్లుగా ఒళ్లు హూనం చేసుకుని.. ఎంతో కష్టపడిన అఖిల్‌ను ఈ సినిమా ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సారి ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలనుకున్న అఖిల్ కల.. కలగానే మిగిలిపోయింది. అయితే ఏజెంట్ తర్వాత చాలా రోజుల గ్యాప్‌తో మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌తో అఖిల్ ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో అఖిల్ తన నెక్స్ట్ మూవీ కోసం కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. దీనికోసమే జట్టు కూడా పెంచుతున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అఖిల్ నెక్స్ట్ నటించబోయే చిత్రం ఓ పీరియాడికల్ డ్రామా అని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై తండ్రి, ప్రముఖ హీరో నాగార్జున ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.