WIW vs NZW : మహిళల టీ20 వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్‌కు వేళైంది. మాజీ చాంపియన్ వెస్టిండీస్ (West Indies), న్యూజిలాండ్ (Newzealand) జట్ల మధ్య ఫైనల్ బెర్తు ఫైట్ మరికాసేపట్లో మొదలవ్వనుంది. షార్జా క్రికెట్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది.
బలమైన విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని కెప్టెన్ సోఫీ డెవినె బ్యాటింగ్ తీసుకుంది. పాకిస్థాన్‌పై గెలుపొందిన జట్టుతోనే కివీస్ బరిలోకి దిగనుంది. మరోవైపు.. రెండో టైటిల్ వేటలో జోరుమీదున్న హేలీ మాథ్యూస్ బృందం ఒక్క మార్పు చేసింది. నేషన్స్ స్థానంలో స్టఫానీ టేలర్‌ను తీసుకుంది.
న్యూజిలాండ్ జట్టు : సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మెర్, అమేలియా కేర్, సోఫీ డెవినే(కెప్టెన్), బ్రూకీ హల్లిడే, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్(వికెట్ కీపర్), రోస్మెరీ మైర్, లీ తహుహు, ఈడెన్ కార్ల్సన్, ఫ్రాన్ జొనాస్.
వెస్టిండీస్ జట్టు : క్వియానా జోసెఫ్, హేలీ మాథ్యూస్(కెప్టెన్), షెమైనే క్యాంప్బెల్లె(వికెట్ కీపర్), డియాండ్ర డాటిన్, స్టఫానీ టేలర్, చినెల్లె హెన్రీ, జైదా జేమ్స్, అశ్మిని మునిసర్, అలియహ్ అలెయ్నె, అఫీ ఫ్లెచర్, కరిష్మా రామ్హరాక్.