paris olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్చరీలో భారత్‌కు మరోసారి నిరాశే మిగిలింది. ప్రముఖ విలుకాడు తరుణ్‌దీప్ రాయ్(Tarundeep Rai) వ్యక్తిగత విభాగంలోనూ ముందంజ వేయలేకపోయాడు. బుధవారం ఉత్కంఠగా సాగిన 64వ రౌండ్లో బ్రిటన్‌కు చెందిన టామ్ హాల్(Tom Hall) చేతిలో రాయ్ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు.
తొలి సెట్‌ను 27-27తో టై చేసిన భారత ఆర్చర్ రెండో సెట్ కోల్పోయాడు. అనంతరం మూడో సెట్లో పుంజుకొని 28-25తో హాల్‌కు షాకిచ్చాడు. అయితే.. నిర్ణయాత్మకమైన నాలుగో సెట్లో బ్రిటన్ ఆర్చర్ అసమాన ప్రతిభను కనబరిచి అత్యధిక పాయింట్లు గెలిచాడు. దాంతో, హాల్ 6-4తో తరుణ్‌దీప్ రాయ్‌పై గెలుపొందాడు.
Veteran Archer @ImDeepikaK Archer advances to Pre quarter final in Individual Category!!#indianarchery #paris2024 #olympics #archeryinparis pic.twitter.com/BtI5VOJhb1
— ARCHERY ASSOCIATION OF INDIA (@india_archery) July 31, 2024
విశ్వ క్రీడల ఐదో రోజు జరిగిన మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి(Deepika Kumari) సత్తా చాటింది. బుధవారం జరిగిన 64వ రౌండ్ పోటీల్లో రీనా పర్నాట్(ఎస్తోనియా), క్వింటీ రోఫెన్(నెదర్లాండ్స్)లను ఓడించిన దీపిక ముందంజ వేసింది. తొలుత పర్నాట్ను 6-5తో పైచేయి సాధించిన భారత ఆర్చర్.. 32వ రౌండ్లో రోఫెన్పై 6-2తో విజయం సాధించింది. క్వార్టర్స్ బెర్తును నిర్ణయించే తర్వాతి పోరులో దీపిక జర్మనీ ఆర్చర్ మిచెల్లె క్రొప్పెన్ (Mitchelle Kroppen)తో తలపడనుంది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో ఉన్న మిచెల్లెకు దీపిక చెక్ పెడితే పతక వేటలో ముందుకెళ్తుంది.