IND vs ENG : స్వల్ప ఛేదనలో భారత జట్టుకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. విధ్వంసక ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0)ను ఆర్చర్ డకౌట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడి ఓవర్లోనే వెనుదిరిగిన యశస్వీ.. ఈసారి షార్ట్ పిచ్ బంతికి పెద్ద షాట్ ఆడబోయి వికెట్ కీపర్ స్మిత్ చేతికి దొరికాడు. దాంతో, 5 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్(5), కరుణ్ నాయర్(2)లు జాగ్రత్తగా ఆడుతూ భాగస్వామ్యం నిర్మించే పనిలో ఉన్నారు. ఇంకా గిల్ సేన విజయానికి 186 రన్స్ కావాలి.
బర్మింగ్హమ్లో సంచలన విజయంతో సిరీస్ సమం చేసిన భారత జట్టు లార్డ్స్‌లోనూ గెలుపు వాకిట నిలిచింది. నాలుగో రోజు బౌలర్ల విజృంభణతో ఇంగ్లండ్ ఆటగాళ్లు డగౌట్‌కు క్యూ కట్టారు. తొలి సెషన్లో సిరాజ్(2-31) నిప్పులు చెరిగితే లంచ్ తర్వాత వాషింగ్టన్ సుందర్ (4-22) ఆతిథ్య జట్టు నడ్డివిరిచాడు. డేంజరస్ జో రూట్(40), బెన్ స్టోక్స్(33), జేమీ స్మిత్(8)లను క్లీన్బై టీ బ్రేక్ అనంతరం జస్ప్రీత్ బుమ్రా(2-38) వికెట్ల వేట కొనసాగించాడు. బషీర్‌ను సుందర్ బౌల్డ్ చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో192కే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
Innings Break!
Outstanding bowling display from #TeamIndia! 👏 👏
4⃣ wickets for Washington Sundar
2⃣ wickets each for Mohammed Siraj & Jasprit Bumrah
1⃣ wicket each for Akash Deep & Nitish Kumar ReddyIndia need 193 runs to win!
Updates ▶️ https://t.co/X4xIDiSmBg… pic.twitter.com/1BRhfPzynv
— BCCI (@BCCI) July 13, 2025