Tenth Get together | అబిడ్స్, జూలై 13 : గోషామహల్ ప్రభుత్వ పాఠశాల 1975వ బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. పూర్వ విద్యార్థులలో ఒకరైన పదవి విరమణ పొందిన అదనపు ఎస్పి కెఎం మధు నివాసంలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ పాఠశాల స్మృతులను నెమరు వేసుకున్నారు. ఇందులో అత్యధికులు పదవి విరమణ పొందిన వారు కావడంతో వారు తమ ఉద్యోగ బాధ్యతలు ఇతరత్రా వాటిపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా కేఎం మధు మాట్లాడుతూ 50 ఏళ్ల తర్వాత పలు విభాగాల్లో పదవి విరమణ పొందిన ఆనాటి పాత మిత్రులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.1975 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులం అత్యధికలం ఇక్కడ సమావేశం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.