Virat Kohli | భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ (Vrindavan) ఆశ్రమానికి వెళ్లారు. తన భార్య, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ (Anushka Sharma), ఇద్దరు పిల్లలు వామిక, అకాయ్‌తో కలిసి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహరాజ్ స్వామీజీ వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరుష్క దంపతులు బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ ఈ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ప్రేమానంద్ మహరాజ్ స్వామీజీ చెప్పిన ప్రవచనాలను ఆలకించారు.
#WATCH | #ViratKohli and Anushka Sharma arrive at Uttar Pradesh’s Vrindavan pic.twitter.com/u6rI5EGLMn
— ANI (@ANI) May 13, 2025
డ్యాషింగ్ బ్యాటర్, పరుగుల రారాజుగా పేరొందిన విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఉదయం ఇన్‌స్టా అకౌంట్లో ఓ భావోద్వేగపూరిత పోస్టును పెట్టాడు. టెస్టు క్రికెట్లో దేశం తరపున అరంగేట్రం చేసి 14 ఏళ్లు అవుతున్నట్లు కోహ్లీ తన పోస్టులో తెలిపాడు. టెస్టు ఫార్మాట్ తనకు ఎంతో నేర్పిందని, తనను పరీక్షించిందని, తతను తీర్చిదిద్దిందని, జీవితానికి కావాల్సిన ఎన్నో పాఠాలు నేర్పినట్లు కోహ్లీ పేర్కొన్నాడు. తెలుపు రంగు దుస్తుల్లో ఆడడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందన్నారు. టెస్టు ఫార్మాట్‌ను వీడడం సులువైన అంశం కాదు అని, కానీ సరైన సమయం అని, ఆ ఫార్మాట్ ఎంతో చేశానని, తనకు కూడా ఎంతో కలిసి వచ్చిందన్నారు. ఊహించినదాని కన్నా ఎక్కువే లాభం జరిగిందని చెప్పుకొచ్చాడు.
Virat Kohli & Anushka Sharma से पूज्य महाराज जी की क्या वार्तालाप हुई ? Bhajan Marg pic.twitter.com/7IWWjIfJHB
— Bhajan Marg (@RadhaKeliKunj) May 13, 2025
Also Read..