Virat Kohli | టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన విలువైన సమయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు. లండన్ షిఫ్ట్ అయిన ఈ స్టార్ క్రికెటర్.. ప్రస్తుతం ముంబైలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. భార్య, బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ (Anushka Sharma), కుమారుడు, కుమార్తెతో కలిసి సరదాగా గడుపుతున్నారు.
తాజాగా ఈ స్టార్ జంట ముంబైలోని ఫేమస్ రెస్టారెంట్లో సందడి చేశారు (breakfast date in Mumbai). నగరంలోని ప్రముఖ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ బెన్నె బాంబే (Benne Bombay)లో బ్రేక్‌ఫాస్ట్‌ను ఆస్వాదించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో ఇద్దరూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సదరు రెస్టారెంట్ అధికారిక ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఇక ఈనెల 5న కోహ్లీ తన 36వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ రన్ మెషీన్ బర్త్‌డే సందర్భంగా అనుష్క ఓ అందమైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కోహ్లీ.. తన కుమార్తె వామిక, కుమారుడు అకాయ్‌ని ఎత్తుకుని ఉన్న పిక్‌ను పంచుకుంది. అయితే, ఆ ఫొటోలో పిల్లలిద్దరి ముఖాలూ కనిపించకుండా లవ్ సింబల్స్‌తో కవర్ చేశారు. ఆ ఫొటో కూడా ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Also Read..
Sidhu Moose Wala | సిద్ధూ మూసేవాలా సోదరుడిని చూశారా.. ఫొటో వైరల్
Elon Musk | అమెరికాలో నాకు ఎలాంటి భవిష్యత్తూ కనిపించట్లేదు.. ట్రంప్ గెలుపుపై మస్క్ కుమార్తె ఆందోళన