Sidhu Moose Wala | దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. 58 ఏళ్ల వయసులో సిద్ధూ తల్లి చరణ్ కౌర్ (Charan Kaur) ఈ ఏడాది మార్చిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు శుభ్‌దీప్ (సిద్ధూ మూసేవాలా అసలు పేరు) అని పేరు కూడా పెట్టారు. తాజాగా బాబు ముఖాన్ని సిద్ధూ తల్లిదండ్రులు రివీల్ చేశారు. ఈ మేరకు ఫొటో, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో బాబు తలపాగాతో ఎంతో ముద్దుగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో, వీడియో వైరల్‌గా మారింది.
కాగా, ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురైన విషయం తెలిసిందే. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గం మధ్యలో దుండగులు అతడిని అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, తన తల్లిదండ్రులకు సిద్ధూ ఒక్కడే సంతానం కావడంతో.. అతడి మృతితో వారు తల్లడిల్లిపోయారు. ఈ క్రమంలో ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన వారు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ ద్వారా చరణ్ కౌర్.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ‘భగవంతుడి ఆశీస్సులతో మేము శుభదీప్ను (Shubhdeep) తిరిగి పొందాము’ అంటూ అప్పట్లో సిద్ధూ తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read..
Elon Musk | వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోతారు.. కెనడా ప్రధాని ట్రూడోపై జోష్యం చెప్పిన ఎలాన్ మస్క్
Sunita Williams | క్షీణించిన సునీతా విలియమ్స్ ఆరోగ్యం..? క్లారిటీ ఇచ్చిన నాసా
Salman Khan | సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు.. ధైర్యం ఉంటే వారిని రక్షించుకోవాలంటూ హెచ్చరిక