Anil Kumble | మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) ఇవాళ బస్సు ప్రయాణం చేశారు. బెంగళూరు (Bengaluru)లో ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి బీఎమ్టీసీ (Bengaluru Metropolitan Transport Corporation) బస్సులో ప్రయాణించారు. ఈ విషయాన్ని కుంబ్లే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు బస్సులో ప్రయాణిస్తున్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘శక్తి గ్యారెంటీ’ పథకంపై ప్రైవేటు రవాణా ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. ఈ పథకం వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ప్రైవేటు రవాణాకు చెందిన ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కుంబ్లే కూడా విమానాశ్రయం నుంచి తన నివాసానికి వెళ్లేందుకు ప్రైవేట్ రవాణా అందుబాటులో లేకపోవడంతో ఇలా బస్సు ప్రయాణం చేశారు.
BMTC trip back home today from the airport. pic.twitter.com/jUTfHk1HrE
— Anil Kumble (@anilkumble1074) September 11, 2023
Also Read..
IndiGo | ఇండిగో ఫ్లైట్లో మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యకర ప్రవర్తన.. రెండు నెలల్లో నాలుగోది
Cyber Crime | అసలుకు, నకిలీకి మధ్య తేడాను గుర్తించండి.. 1930పై పోలీసుల వినూత్న ప్రచారం