IPL 2025 : సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అనికేత్ వర్మ(74) విశాఖపట్టణంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. మిచెల్ సట్ఆర్క్(5-35) విజృంభణతో టాపార్డర్ విఫలమవ్వగా.. జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యతను భుజాన వేసుకున్నాడీ కుర్రాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్(0).. ఔటయ్యాక అనికేత్ వర్మ(74 : 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఉతికారేశాడు. అలవోకగా సిక్సర్లు బాదుతూ జట్టు స్కోర్ 150 దాటించాడు. అనికేత్ వికెట్ పడ్డాక సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. స్టార్క్ బౌలింగ్‌లో మల్డర్ ఔట్ కావడంతో హైదరాబాద్ జట్టు 163 పరుగులకే కుప్పకూలింది.
ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్‌లో 286 రన్స్ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తడబడింది. ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ధాటికి(5-35) టాపార్డర్ వైఫల్యంతో 163 పరుగులకే ఆలౌటైంది. దంచికొట్టే అలవాటున్న ట్రావిస్ హెడ్(22), అభిషేన్ శర్మ(0), ఇషాన్ కిషన్(2)లు మళ్లీ నిరాశపరిచారు. 37 పరుగులకే 4 వికెట్లు పడడంతో ఆరెంజ్ ఆర్మీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో 23 ఏళ్ల అనికేత్ వర్మ(74 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు.
Let’s do it 💪#PlayWithFire | #DCvSRH | #TATAIPL2025 pic.twitter.com/6sUymMtlkD
— SunRisers Hyderabad (@SunRisers) March 30, 2025
ఓవైపు సహచరులు డగౌట్‌కు క్యూ కడుతున్నా వెరవలేదు ఈ హిట్టర్. క్రీజులో పాతుకుపోయిన అతడు భారీ సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లను బెంబేలెత్తించాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ.. ఎవరినీ వదలకుండా ఉతికేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఐపీఎల్లో తొలి ఫిఫ్టీ నమోదు చేసిన అనికేత్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. అక్షర్ పటేలో వేసిన 15వ ఓవర్లో రెచ్చిపోయిన ఈ యంగ్‌స్టర్ 4, 6, 6 బాదాడు. స్టార్ ఆటగాళ్లు చేతులెత్తేసిన చోట తనదైన శైలిలో బౌండరీలతో చెలరేగిన అతడు హెన్రిచ్ క్లాసెన్(32)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
Jump. Timing. Perfection. 🔝
An excellent catch from Jake Fraser-McGurk at the ropes brings an end to Aniket Verma’s fighting knock! 💙
Updates ▶️ https://t.co/L4vEDKzthJ#TATAIPL | #DCvSRH | @DelhiCapitals pic.twitter.com/7b6eekZtRC
— IndianPremierLeague (@IPL) March 30, 2025
మోహిత్ శర్మ ఓవర్లో క్లాసెన్ ఔటయ్యాక అనికేత్‌కు డికి సహకారం అందించేవాళ్లు కరవయ్యారు. కుల్దీప్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్(1) బౌండరీ లైన్ వద్ద ఫ్రేజర్ చేతికి చిక్కాడు. దాంతో, 123 వద్ద ఆరెంజ్ ఆర్మీ ఏడో వికెట్ పడింది. ఆ కాసేపటికే బౌండరీ లైన్‌వద్ద ఫ్రేజర్ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టడంతో అనికేత్ వెనుదిరిగాడు.. ఇక టెయిలెండర్లను ఔట్ చేసిన స్టార్క్ ఈ సీజన్లో తొలిసారి ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.