హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్‌తో ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర నిలకడగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 58 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. షేక్ రషీద్ (79 నాటౌట్), కరణ్ షిండే (41 నాటౌట్) క్రీజులో ఉండగా తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 133 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 244/5తో రెండో రోజు ఆట ఆరంభించిన హైదరాబాద్.. 301 పరుగులకు ఆలౌట్ అయింది. తన్మయ్ (159) మినహా లోయరార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు.