Shama Mohamed | దుబాయ్ (Dubai) వేదికగా మంగళవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియా (Australia)పై టీమ్ ఇండియా (Team India) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో రోహిత్ సేన మట్టికరిపించింది. కంగారూలు నిర్దేశించిన 265 పరుగుల ఛేదనను రోహిత్ సేన 48.1 ఓవర్లలో పూర్తిచేసి ఈ టోర్నీలో వరుసగా మూడోసారి ఫైనల్ చేరింది. భారత జట్టు సాధించిన ఈ అద్భుత విజయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలుపుతున్నారు.
ఇదే సందర్భంలో ఇటీవలే భారత కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ (fat shaming row)తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ (Shama Mohamed) కూడా టీమ్ ఇండియా విజయం పట్ల స్పందించారు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Congratulations to #TeamIndia for their spectacular victory against Australia in the semifinals of the Champions Trophy 2025. A big shout out to @imVkohli for scoring 84 and to be the first player to score 1000 runs in ICC knock out tournaments !
— Dr. Shama Mohamed (@drshamamohd) March 4, 2025
‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు. కీలక మ్యాచ్‌లో 84 పరుగులు సాధించడంతో పాటు ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్లలో వెయ్యి రన్స్ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీకి ప్రత్యేక అభినందనలు’ అని షమా ట్వీట్ చేశారు. అంతేకాకుండా ‘రోహిత్ శర్మ నాయకత్వంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. 84 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి ప్రత్యేక అభినందనలు. ఫైనల్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అంటూ షమా మీడియాతో అన్నారు.
#WATCH | Delhi: On team India’s victory against Australia in the semi-finals of the ICC Champions Trophy, Congress leader Shama Mohamed says, “I am very happy today that India has won the semi-final match against Australia under the captaincy of Rohit Sharma. I congratulate Virat… pic.twitter.com/UbRi2k3lqs
— ANI (@ANI) March 4, 2025
రోహిత్‌శర్మపై షహా మహ్మద్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. రోహిత్ లావుగా ఉన్నాడని, అతడు బరువు తగ్గాలంటూ బాడీషేమింగ్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన ట్వీట్‌పై రాజకీయ నాయకులు, మాజీ క్రికెటర్లు, నెటిజనులు భిన్నంగా స్పందించారు. షమా తన ట్వీట్లో ‘రోహిత్ శర్మ క్రీడాకారుడిగా ఫిట్‌గా లేడు! అతడు బరువు తగ్గాలి. భారత క్రికెట్ జట్టులో గత సారథులతో పోల్చితే ఆకట్టుకోని కెప్టెన్ అతడే’ అని రాసుకొచ్చింది.
ఈ ట్వీట్ నెట్టింట కాసేపట్లోనే వైరల్ అయింది. షమా ట్వీట్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ స్పందిస్తూ ‘గత కొన్నాళ్లుగా రోహిత్ ప్రదర్శన నాసిరకంగా ఉంది. ఇటీవల కాలంలో అతడు ఒక సెంచరీ తప్పితే మిగతా మ్యాచ్‌లలో రెండు, మూడు, నాలుగు పరుగులే చేసి ఔట్ అవుతున్నాడు. అతడు జట్టులో ఉండకూడదు. ఇతర ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయడంతో భారత జట్టు గెలుస్తుంది తప్ప కెప్టెన్ పాత్ర ఏమీలేదు. షమా చెప్పింది అక్షరాలా నిజం’అని వ్యాఖ్యానించడం గమనార్హం.
షమా వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి మాట్లాడుతూ.. ‘ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటు! భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌నూ వాళ్లు వదట్లేదు. రాజకీయాల్లో విఫలమైన వారి నాయకుడు రాహుల్ గాంధీని వాళ్లు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారేమో’ అని కౌంటర్ ఇచ్చాడు. షమా ట్వీట్ రాజకీయంగా దుమారం రేపడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎప్పటిలాగానే అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, వాటికి పార్టీతో సంబంధం లేదని తెలిపింది. ఆ తర్వాత షమా తన ట్వీట్‌ను తొలగించింది.
Also Read..
రోహిత్‌పై కాంగ్రెస్ లీడర్ బాడీ షేమింగ్