Australia Womens Team : ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు త్వరలోనే వెస్టిండీస్ పర్యటన(West Indies Tour)కు వెళ్లనుంది. అందుకోసం వన్డేలు, టీ20లకు కలిపి 15మంది కూడిన బృందాన్ని సెలెక్టర్లు ఈ రోజు ప్రకటించారు. అయితే.. రెగ్యులర్ కెప్టెన్ మేగ్ లానింగ్(Meg Lanning) అందుబాటులో లేకపోవడంతో సెలెక్టర్లు అలిసా హీలీ(Alyssa Healy)కి కెప్టెన్సీ అప్పగించారు. విండీస్ టూర్లో ఆసీస్ తొలుత మూడు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య అక్టోబర్ 1న మొదటి టీ20 మ్యాచ్ జరుగనుంది.
ఆస్ట్రేలియా స్క్వాడ్ : అలిసా హీలీ(కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్(వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, అషే గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హ్యారిస్, జెస్ జొనాసెన్, అలనా కింగ్, ఫోబే లిట్చ్‌ఫీల్డ్, బేత్ మూనీ, ఎలిసా పెర్రీ, మేగన్ షట్, అన్నాబెల్ సుథర్లాండ్, జార్జియా వరేహం.
The first Australian squad of the summer of cricket is here!
Our @AusWomenCricket team will play three T20Is and three ODIs against the West Indies starting October 1 💪 pic.twitter.com/fbsDtiKPvV
— Cricket Australia (@CricketAus) September 7, 2023
‘లానింగ్ ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉంది. కానీ, ఆమె అంతర్జాతీయ క్రికెట్‌కు అందుబాటులో లేదు. ఆమె త్వరలోనే జట్టుతో కలువనుంది. అయితే.. ఫిట్నెస్, ఫామ్ చాటుకునేందుకు దేశవాళీ క్రికెట్లో లానింగ్ కొన్ని మ్యాచ్‌లు ఆడాలని అనుకుంటోంది’ అని ఆసీస్ మహిళల జట్టు టీమ్ డైరెకర్టర్ పిప్ ఇంగే(Pip Inge) ఓ ప్రకటనలో తెలిపింది.