Ben Stokes : ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) భారత్‌తో టెస్టు సిరీస్(Test Series)కు దూరం కానున్నాడు. కారణం ఏంటో తెలుసా..? వన్డే వరల్డ్ కప్(World Cup 2023) తర్వాత ఈ స్టార్ బ్యాటర్ మోకాలికి సర్జరీ(knee surgery) చేయించుకోనున్నాడు. అందుకనే టీమిండియాతో టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదని చెప్పాడు. ‘స్పెషలిస్ట్‌లతో కలిసి నా గాయంపై చర్చిస్తున్నా. వాళ్లు ఒక ప్లాన్ చెప్పారు. వరల్డ్ కప్ ముగిశాక దాన్ని అమలు చేస్తాం. వచ్చే సమ్మర్లో నేను పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగుతాను.
ఇప్పటికైతే వరల్డ్ కప్‌లో రాణించడం, మోకాలి గాయం పెద్దది కాకుండా చూసుకోవడంపైనే దృష్టి పెట్టాను’ అని స్టోక్స్ అన్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్‌కు రానుంది. జనవరి 25న భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఈ ఏడాది ఆరంభం నుంచి మెకాలిలో క్రానిక్ టెండానిటిస్(tendonitis) అనే సమస్యతో బాధ పడుతున్నాడు. అందుకనే అతను చాలావరకు బ్యాటింగ్‌కు పరిమితమయ్యాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఈ ఆల్‌రౌండర్ అద్భుతంగా రాణించాడు. కష్టసమయంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ఆదుకున్నాడు. దాంతో, ఐదు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది.
బెన్ స్టోక్స్
స్వదేశంలో జరిగిన 2019 వరల్డ్ కప్‌లో స్టోక్స్ చెలరేగాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌పై ఫైనల్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 82 నాటౌట్‌తో మ్యాచ్‌ను సూపర్ ఓవర్(Super Over)కు తీసుకుళ్లాడు. జోఫ్రా ఆర్చర్ సూపర్ స్పెల్‌తో కివీస్ మ్యాచ్ చేజార్చుకుంది. దాంతో, ఇంగ్లండ్ జట్టు మొదటిసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుంది. ఆ ప్రపంచ కప్ తర్వాత వన్డేలకు గుడ్ బై చెప్పిన స్టోక్స్ హెడ్‌కోచ్ మాథ్యూ మ్యాట్ (Matthew Mott) కోరిక మేరకు యూటర్న్ తీసుకున్నాడు. 50 ఓవర్ల ఆటలో తన మ్యాజిక్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ విధ్వంసక బ్యాటర్ న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కి ఎంపికయ్యాడు.
భారత గడ్డపై అక్టోబర్ 5న ప్రపంచ కప్ పోటీలు షురూ కానున్నాయి. ప్రపంచ కప్ ఆరంభ పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఢీ కొననున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో ఎదురుపడనున్నాయి. మొత్తం 10 జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీ విజేత ఎవరో నవంబర్ 19న తేలిపోనుంది. ఈసారి ఫైనల్‌తో పాటు సెమీఫైనల్స్‌కు కూడా రిజర్వ్ డేను కేటాయించారు.