న్యూ ఢిల్లీ: న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ యువ ఆల్‌రౌండర్ పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది.
ఈ నేపథ్యంలో సుందర్‌కు బదులుగా నిలకడగా రాణిస్తున్న రాజస్థాన్ లెగ్‌స్పిన్నర్ రవిబిష్ణోయ్‌ను సెలెక్టర్లు టీమ్ఇండియాకు ఎంపిక చేశారు. జాతీయ జట్టు తరఫున 42 మ్యాచ్‌లాడిన బిష్ణోయ్ 61 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది ఇంగ్లండ్‌పై ఆఖరి మ్యాచ్ ఆడిన బిష్ణోయ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు గాయం నుంచి కోలుకుంటున్న హైదరాబాద్ బ్యాటర్ తిలక్‌వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను తొలి మూడు మ్యాచ్‌లకు ఎంపిక చేశారు.