TTWC : ప్రతిష్ఠాత్మక టేబుల్ టెన్నిస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు శనివారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో టీనేజర్ ఆకుల శ్రీజ (Akula Sreeja) నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య బరిలోకి నిలిచిన తను తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. అయితే.. ముఖర్జీ సిస్టర్స్ (Mukherjee Sisters) అయిన ఐతికా, సుతీర్థలు ముందంజ వేశారు. మహిళల డబుల్స్‌లో దియా చితాలే, యశస్వినీ గోడ్పాడేలు రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. పురుష డబుల్స్‌లో మానవ్ థక్కర్, మనుష్ షా ద్వయం జయభేరి మోగించింది.
టేబుల్ టెన్నిస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలుస్తుందనుకున్న శ్రీజ స్వీయ తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. 84వ ర్యాంకర్ అయిన థాయ్‌లాండ్‌కు క్రీడాకారిణి సుథాసిని సవెట్టాబుట్ చేతిలో 1-4తో ఓటమి పాలైంది. తొలి సెట్ గెలుపొందిన శ్రీజ.. ఆ తర్వాత అదే తీరుగా ఆడలేకపోయింది. పుంజుకున్న ప్రత్యర్థి వరుస సెట్లలో భారత ప్లేయర్‌కు షాకిచ్చింది. దాంతో, 34 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియగా.. శ్రీజ ఇంటిదారి పట్టింది.
🚨#News l Sreeja Akula faces an early exit in Women’s singles of the ITTF World C’ships🏆
🇮🇳Akula Sreeja lost to Suthasini Sawettabut🇹🇭 (1-4)
🏓Scores: (11-9, 8-11, 6-11, 5-11, 2-11)#ITTF #indiantt pic.twitter.com/iQS5hJtDkO— The Bridge (@the_bridge_in) May 17, 2025
ఆసియా క్రీడల్లో పతకంతో మెరిసిన ఐహికా, సుతీర్థ ద్వయం.. తుర్కియే జంటకు షాకిచ్చింది. ఐదు సెట్ల పోరులో ఒజ్గే ఇల్మజ్, ఎసె హరాక్ జోడీపై 11-4, 9-11, 12-10, 11-9, 7-11తో జయకేతనం ఎగురవేసింది. మరో మ్యాచ్‌లో దియా, యశస్వీనీ జోడీ ఉజ్బెకిస్థాన్ జంటను చిత్తుగా ఓడించింది. నాలుగు సెట్ల పోరులో 3-1తో ఆధిపత్యం చెలాయించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇక పురుషుల డబుల్స్‌లో థక్కర్, షాలు అంచనాలకు తగ్గట్టు రాణించి ప్రత్యర్థికి చెక్ పెట్టారు. స్లోవేనియాకు చెందిన డెని కొజు, పీటర్ హ్రిబర్ జంటను మూడు సెట్లలో వణికిస్తూ 3-0తో విజయం సాధించారు.