Nizam College | జియగూడ, మే 17 : హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల జీవితాలతో కాలేజీ ప్రిన్సిపాల్ చెలగాటం ఆడుతున్నారని శనివారం కాలేజీ ముందు రోడ్డుపై బైఠాయించి ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎగ్జామ్స్ ఫీజు కట్టించుకొని ఇప్పుడు 75 శాతం అటెండెన్స్ లేదని ఇప్పుడు హాల్ టికెట్స్ ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపించారు. డిగ్రీ సెకండ్, థర్డ్ ఇయర్‌కు చెందిన 350 మంది విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా ప్రిన్సిపాల్ మొండిగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ రూమ్‌కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.
ఇవాళ 6వ సెమిస్టర్ ఎగ్జామ్స్‌ను బహిష్కరించి తోటి విద్యార్థులు, అందరికి హాల్ టికెట్స్ ఇస్తేనే ఎగ్జామ్ రాస్తామంటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 75 శాతం అటెండెన్స్ లేదని తెలిసిన విద్యార్థులతో కేవలం ఫీజు దండుకోని విద్యార్థుల భవిష్యత్తు సంవత్సరం పాటు అంధకారంలో నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటెడెన్స్ లేదని తెలిసి విద్యార్థులకు హాల్ టికేట్లు ఇవ్వకుండా ఫీజు వసూలు చేసిన కాలేజీ యాజమన్యంపై తాను కోర్టుకు వెళ్తానని ఓ విద్యార్థి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎగ్జామ్స్‌కు వారం ముందు హాల్ టికెట్ ఇవ్వాలి, కానీ ఓక రోజు ముందు నిన్న శుక్రవారం 16వ తేదీన ఉదయం 11 గంటలకు హాల్ టికెట్లు అందజేశారు. మొత్తం 560 మంది విద్యార్థులలో 350 మంది విద్యార్థులకు హల్ టికెట్లు ఇవ్వలేదన్నారు. ప్రిన్సిపాల్‌ను అడిగితే కేసులు పెడాతాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. హాల్ టికెట్లు ఇవ్వకుంటే సెమిస్టర్ బైకాట్ చేసి నిత్యం ఆందోళన చేపడతామన్నారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్‌కు ఎటువంటి ఆవగాహన లేదని విద్యార్థులు పేర్కోంటున్నారు. చివరకు పోలీసుల జోక్యంతో శాంతించారు.