Akash Deep’s Sister : బర్మింగ్హమ్ టెస్టులో భారత జట్టు చిరస్మరణీయ విజయంలో ఆకాశ్ దీప్ (Akash Deep Sister) పాత్రను ఎంతపొగిడినా తక్కువే. ఐదో రోజు ఏమాత్రం బౌలింగ్‌కు సహకరించని పిచ్ మీద అతడు నాలుగు కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను ముంచాడు. చేతన్ శర్మ (Chetan Sharma) తర్వాత ఇదే వేదికపై పది వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా కీర్తి గడించిన ఆకాశ్.. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనను క్యాన్సర్‌తో బాధ పడుతున్న సోదరికి అంకితమిస్తున్నట్టు చెప్పాడు. దాంతో, అతడి సోదరి ఎవరు? ఆమె స్పందన ఎంటీ? అనే విషయాలు తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇంగ్లండ్ టాపార్డర్‌ను కూల్చి టీమిండియా విజయానికి బాటలు వేసిన ఆకాశ్ దీప్ తన సోదరి క్యాన్సర్‌తో పోరాడుతోందని చెప్పాడు. స్పీడ్‌స్టర్‌కు అక్క అయిన అఖండ జ్యోతి(Akhand Jyoti)కి క్యాన్సర్ ఉందనే విషయం ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. అలాంటిది మ్యాచ్ తర్వాత భావోద్వేగంతో అతడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. తమ్ముడు తనపై చూపించే ప్రేమాభిమానాలకు అఖండ జ్యోతి కూడా భావోద్వేగానికి లోనైంది. ఆకాశ తుందనే విషయాన్ని జయంలో కీలక పాత్ర పోషించ ఆకాశ్ దీప్ సోదరి అఖండ్ జ్యోతి భావోద్వేగానికి లోనైంది.
Akashdeep , Bihar express ♥️
— Bihar_se_hai (@Bihar_se_hai) July 4, 2025
‘నేను క్యాన్సర్ మూడో స్టేజ్. ఇంకో ఆరు నెలలు వైద్యం తప్పనిసరి. అయితే.. నాకు క్యాన్సర్ ఉందనే విషయం ఆకాశ్ చెప్పేంత వరకూ ఎవరికీ తెలియదు. అతడలా చెప్పేస్తాడని మేము ఊహించలేదు. కానీ, మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన తర్వాత ఆకాశ్ ఎమోషనల్ అయ్యాడు. తన పది వికెట్ల సూపర్ స్పెల్‌ను నాకు అకింతం చేస్తున్నానని చెప్పాడు. అందుకు చాలా గర్వపడుతున్నా. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడానికి ముందు అతడిని విమానాశ్రయంలో కలిశాను. ‘నేను బాగానే ఉన్నాను. నా గురించి ఆందోళన చెందవద్దు. దేశాన్ని గెలిపించు’ అని చెప్పి పంపాను. ఇంగ్లండ్ వెళ్లిన తర్వాత కూడా ఆకాశ్ నా ఆరోగ్యం ఎలా ఉందోనని టెన్షన్ పడేవాడు.
అందుకే రెండో టెస్టులో గెలిచిన తర్వాత ఉండబట్టలేక మనసులోని బాధను పంచుకున్నాడు. మ్యాచ్‌లో అతడు వికెట్ తీసిన ప్రతిసారి మేము గట్టిగా ఆరిచేవాళ్లం. దాంతో, ఇరుగుపొరుగు వాళ్లు ఏమైంది అని కంగారుపడేవారు. నాకు ఐపీఎల్ 18వ సీజన్ సమయంలోనే క్యాన్సర్ నిర్దారణ అయింది. దాంతో, నాకోసం ఆకాశ్ మ్యాచ్‌కు ముందు రోజు.. ఆ తర్వాతిరోజు ఆస్పత్రికి వచ్చి వెళ్లేవాడు. నేనే కాదు కుటుంబమంటే మావాడికి ఎనలేని ప్రేమ’ అని ఆఖండ వెల్లడించింది.
ఆకాశ్ తల్లిదండ్రుల పేరు రాంజీ సింగ్, లద్దుమా దేవీ. నాన్న బిహార్‌లో ప్రభుత్వ టీచర్‌గా పనిచేసేవారు. అయితే.. అతడి చిన్నతనంలోనే తండ్రి, పెద్ద అన్న వెంట వెంటనే మరణించారు. వరుష విషాదాలతో కుంగిపోయిన ఆకాశ్ మేనమామ దగ్గర ఉంటూ బౌలింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. దేశవాళీలో అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిలో పడిన ఆకాశ్.. ఇంగ్లండ్ పర్యటనలో బుమ్రా లేని లోటు కనిపించనీయలేదు. బంతిని స్వింగ్ చేస్తూ ఆతిథ్య జట్టు బ్యాటర్లను పెవిలియన్‌కు పంపిన అతడు.. గిల్ సేన చరిత్ర సృష్టించడంలో కీలక భూమిక పోషించాడు.
Only the second India bowler to take ten wickets in a Test in England: Akash Deep ⭐ pic.twitter.com/bWDaUwOLYu
— ESPNcricinfo (@ESPNcricinfo) July 7, 2025