Roger Federer : పురుషుల టెన్నిస్‌లో రోజర్ ఫెదరర్ (Roger Federer) ఒక బ్రాండ్. అతడి పేరే కాదు ఆట కూడా అద్భుతమే. సుదీర్ఘ కెరీర్లో ఎనిమిది పర్యాయాలు వింబుల్డన్ (Wimbledon) టైటిల్ గెలుపొందిన ఫెదరర్ మరోసారి తనకు ఎంతో ఇష్టమైన గ్యాలరీ తళుక్కుమన్నాడు. నీలం రంగు సూట్ ధరించి సతీమణి మిర్కా సమేతంగా సోమవారం సెంటర్ కోర్టులో ప్రత్యక్షమయ్యాడీ దిగ్గజ ప్లేయర్. ఇంతకూ ఫెదరర్ మ్యాచ్ చూసేందుకు వచ్చాడంటే అది చాలా ముఖ్యమైనదే అయి ఉండాలి అనుకుంటున్నారా? అవును.. మీరు ఊహించింది నిజమే. ఒకప్పుడు తన ప్రత్యర్థి అయిన నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) మ్యాచ్‌ను కళ్లారా చూసేందుకు విచ్చేశాడు.
ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిర్వహించే వింబుల్డన్ టోర్నీని వీక్షించేందుకు మాజీ విజేతలు వస్తుంటారు. వాళ్లకు ఊదా రంగులోని ఒక బ్యాడ్జ్‌తో పాటు రాయల్ బాక్స్‌లో ప్రత్యేకమైన సీటునుక కేటాయిస్తారు. సో.. సోమవారం సెంటర్ కోర్టులో తనకు కేటాయించిన సీట్లోకి వెళ్తుండగా ఫెదరర్‌కు అభిమానులు, నిర్వాహకులు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. నాలుగో రౌండ్‌కు చేరుకున్న జకో సాయంత్రం ఆస్ట్రేలియాయువకెరటం అలెక్స్ డి మినౌర్(Alex de Minaur)తో తలపడనున్నాడు. ఫెదరర్ దంపతులతో పాటు ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్, జో రూట్ సైతం సెంటర్ కోర్టులో సందడి చేశారు.
Roger Federer on Centre Court. It just feels right 💚💜#Wimbledon pic.twitter.com/dDrrnYkj8n
— Wimbledon (@Wimbledon) July 7, 2025
మాజీ వరల్డ్ నంబర్ 1 అయిన ఫెదరర్‌కు వింబుల్డన్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. గ్రాస్ కోర్ట్ కింగ్‌గా పేరొందిన స్విస్ స్టార్ ఏకంగా 8సార్లు ఇక్కడ విజేతగా నిలిచాడు. అతడు తొలిసారి 2003లో ఈ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని గెలుపొందాడు. అప్పటినుంచి తన ఆధిపత్యాన్ని చెలాయించిన స్విస్ వీరుడు 2017లో ఎనిమిదో టైటిల్ సాధించాడు. అయితే.. రఫెల్ నాదల్, జకోవిచ్ రాకతో ఫెదరర్ జోరుకు బ్రేకులు పడ్డాయి. అతడు చివరిసారిగా 2019లో వింబుల్డన్ ఫైనల్ ఆడాడు.
Roger Federer in the Royal Box at Wimbledon to watch Novak Djokovic & Alex de Minaur’s match at Wimbledon.
A perfect seat for Tennis Royalty.
Welcome back, King.
👑❤️
— The Tennis Letter (@TheTennisLetter) July 7, 2025