బంజారాహిల్స్, జూలై 7: గ్రేహౌండ్స్ విభాగంలో(Greyhounds Employees) కలిసి పనిచేసిన 1989(5బీ) యూనిట్‌కు చెందిన ఉద్యోగులు సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విశ్రాంత డీఐజీ గోపినాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తాము విధులు నిర్వహించిన సమయంలో అనుభవాలను, అప్పటి పరిస్థితులను వారంతా నెమరువేసుకున్నారు.
1989 ప్రాంతంలో నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో తామంతా కలిసి పనిచేశామని, అప్పుడప్పుడు కలుసుకుని జ్ఙాపకాలను నెమరువేసుకుంటామని విశ్రాంత డీఐజీ గోపీనాథ్‌రెడ్డి అన్నారు. తమ యూనిట్‌లోని పలువురు ఉద్యోగులు ఇప్పటికే రిటైరవ్వగా కొంతమంది ఇతర విభాగాల్లో సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత కమాండెంట్స్ అప్పల్‌రెడ్డి, సురేందర్, డీఎస్పీ రాజగోపాల్, అడిషనల్ ఎస్సీ కేఆర్కే.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.