దామరగిద్ద: కేజీబీవీ హాస్టల్ విద్యార్థులకు డాక్టర్ స్రవంతి ,హెల్త్ కేర్ సిబ్బందితో కూడిన బృందం ఆరోగ్య పరీక్షలు ( Medical check-ups ) నిర్వహించారు. రెండు, మూడు రోజులుగా విద్యార్థులు స్వల్ప జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతుండడంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందజేశారు.
మొత్తం 48 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా వారిలో కేవలం 11 మంది విద్యార్థులకు స్వల్ప స్థాయిలో జ్వరం, జలుబు, దగ్గు కనిపించాయని వైద్యులు తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ అంటువ్యాధుల పట్ల అవగాహన కలిగించారు. హాస్టల్లో ఎవరూ కూడా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, నారాయణ, హెల్త్ సూపర్వైజర్ కృష్ణమ్మ, కేజీబీవీ హాస్టల్ ప్రిన్సిపాల్ స్వాతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.