IND vs ENG : ఓవల్ టెస్టులో దంచికొడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్ల జోరుకు బ్రేక్ పడింది. బజ్‌బాల్(Bazz Ball) ఆటతో విధ్వంసం సృష్టిస్తున్న డేంజరస్ బెన్ డకెట్ (43) ఔటయ్యాడు. ఆకాశ్ దీప్ ఓవర్లో స్వీ్ప్ షాట్ ఆడబోయిన డకెట్ వికెట్ కీపర్ జురెల్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో.. 91 పరుగుల వద్ద ఆతిథ్య జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జాక్ క్రాలే(48 నాటౌట్), కెప్టెన్ ఓలీ పోప్(5)లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు స్కోర్.. 98/1. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో పోప్ టీమ్ 126 పరుగులు వెనకబడి ఉంది.
సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఓవల్ టెస్టులో భారత జట్టును 224కే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్ మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు బెన్ డకెట్ (43), జాక్ క్రాలే(48 నాటౌట్)లు బౌండరీలతో చెలరేగుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డకెట్ అయితే.. స్వీప్, స్కూప్ షాట్లతో విరుచుకుపడుతూ భారత బౌలర్లను ఒత్తిడిలో పడేశాడు. కానీ, ఆకాశ్ దీప్ ఓవర్లో వికెట్ల వెనకాలకు ఆడబోయిన అతడు గురి తప్పి.. జురెల్ చేతికి దొరికిపోయాడు. అతడు ఔట్ కావడంతో దాదాపు 8 రన్ రేటుతో సాగిన ఓపెనర్ల పరుగుల వరదకు తెరపడింది.
Akash Deep breaks the opening partnership! ⚡️
Ben Duckett is caught behind for 43.
Updates ▶️ https://t.co/Tc2xpWMCJ6#TeamIndia | #ENGvIND pic.twitter.com/MMvdVsd6aR
— BCCI (@BCCI) August 1, 2025