AIFF : ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య సీనియర్ జట్టుకు హెడ్‌కోచ్‌ను నియమించింది. అంతర్జాతీయంగా సుదీర్ఘ అనుభవమున్న స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు మేనేజర్ మనొలొ మార్కెజ్(Manolo Marquez)కు ప్రధాన కోచ్ పగ్గాలు అప్పగించింది. ఈ విషయాన్ని శనివారం ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య అధికారికంగా వెల్లడించింది. ‘ప్రస్తుత సీజన్ 2024 -25లో మనొలో గోవా ఫుట్‌బాల్ క్లబ్ (Goa FC)కు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అదే సమయంలో ఆయన టీమిండియా కోచ్‌గానూ సేవలందించనున్నాడు’ అని ఏఐఎఫ్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.
‘భారత జట్టు కోచ్‌గా ముఖ్య పాత్రను పోషించనున్న మలొనోను అపూర్వ స్వాగతం పలుకుతున్నాం. జాతీయ జట్టు కోసం తమ కోచ్‌ను వదులుకున్న గోవా క్లబ్‌కు కృతజ్ఞతలు. ఇకపై మలొనోతో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాం. మనొలోకు భారత దేశ సంప్రదాయాలు తెలుసు. అందుకని ఆయన జట్టును గెలుపు బాట పట్టిస్తాడని నమ్మకంగా ఉన్నాం’ అని ఏఐఎఫ్ ఎఫ్ కల్యాణ్ చౌబే వెల్లడించాడు. మనొలొకు భారత గడ్డపై కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. అంతేకాదు హైదరాబాద్ క్లబ్ తరఫున 2021-22 ఐఎస్ఎల్ టైటిల్ గెలిచాడు.
Manolo Marquez appointed head coach of Senior Men’s National Team!
Read full details here 👉🏻 https://t.co/iUUMAwB8vk#IndianFootball ⚽️ pic.twitter.com/Ni9beyul8B
— Indian Football Team (@IndianFootball) July 20, 2024
ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్‌లో భారత జట్టు ఓటమిని సీరియస్‌గా తీసుకున్న ఏఐఎఫ్ఎఫ్ కోచ్‌గా ఉన్న ఇగొర్ స్టిమాక్ (Igor Stimac) స్టిమాక్‌పై వేటు వేసింది. క్రొయేషియాకు చెందిన స్టిమాక్ ఆధ్వర్యంలో భారత జట్టు 53 మ్యాచ్‌లు ఆడగా కేవలం 19 విజయాలు మాత్రమే సాధించింది. దానికి తోడూ ఈ ఏడాది ఏఎఫ్సీ ఆసియా కప్ (AFC Asia Cup)లో టీమిండియా మూడింటా పరాజయం పాలైంది.

అంతేకాదు ఏకంగా ఆరు గోల్స్ సమర్పించుకొని కనీసం ఒక్కటంటే ఒక్క గోల్ కూడా చేయలేదు. అయినా సరే ఆలిండియా ఫుట్‌బల్ సమాఖ్య స్టిమాక్‌పై నమ్మకం ఉంచింది. కానీ, ఫిఫా క్వాలిఫయర్‌లో బ్లూ టైగర్స్ మళ్లీ చెత్త ప్రదర్శన కనబరచడంతో అతడిని హెడ్‌కోచ్‌గా తొలగించింది.