Tumbbad Director | టాలీవుడ్ స్టార్ నటి సమంత బంఫర్ ఆఫర్ కొట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మలయాళంతో పాటు తన సోంత ప్రోడక్షన్లో ఒక సినిమా చేస్తున్న సమంత తాజాగా మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘తుంబాద్’ (Tumbbad). గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2018లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ చిత్ర దర్శకులు రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీలు తాజాగా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.
హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సిరీస్‌లో సమంత, బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ వెబ్ సిరీస్‌ను ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్&డీకే నిర్మించనున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. కాగా ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు ‘తుంబాద్’ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు నిర్మాత సోహమ్ షా తెలిపారు. ‘తుంబాద్’కు సీక్వెల్ చేయమని ఎన్నో విన్నపాలు వచ్చాయి. తప్పకుండా సినిమా చేస్తాం. కానీ, కేవలం డబ్బు, ప్రచారం కోసం సినిమా తీయను’ అని షా పేర్కొన్నారు. ఇక ‘తుంబాద్’ కథ విషయానికి వస్తే.. స్వాతంత్ర్యంకు ముందు మహారాష్ట్రలోని తుంబాడ్ అనే గ్రామంలో దాగి ఉన్న నిధి గురించి సాగే అన్వేషణతో ఈ కథ ఉంటుంది. అత్యాశ మనిషికి ఎలాంటి పరిస్థితికి దిగజారుస్తుందో సినిమాలో చక్కగా చూపించారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఆరేళ్ల పాటు తెరకెక్కించగా.. అనేక సన్నివేశాలను రీషూట్ చేయాల్సి వచ్చింది.
Also Read..