Maheshwar Reddy | కాంగ్రెస్ తెచ్చిన ప్రతి స్కీమ్‌లో స్కామే ఉంటది.. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి విమర్శలు
Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీ పెత్తిన ప్రతి స్కీమ్‌లో స్కామ్ ఉంటుందని.. రేవంత్ సర్కారుది ప్రజా పాలన కాదని.. ప్రజా వ్యతిరేక పాలన అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీ పెత్తిన ప్రతి స్కీమ్‌లో స్కామ్ ఉంటుందని.. రేవంత్ సర్కారుది ప్రజా పాలన కాదని.. ప్రజా వ్యతిరేక పాలన అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ రైతాంగాన్ని మరోసారి మోసం చేసిందని, రుణమాఫీ మొత్తం చేయకముందే సంబరాలు చేసుకుంటున్నారంటూ విమర్శించారు. ప్రజల సొమ్ము ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదనని.. రూ.2లక్షల రుణమాఫీ అని చెప్పి ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. రుణమాఫీ కొంతమందికే చేసి మిగతా రైతులకు ఆంక్షలు పెట్టారన్నారు.
రైతు పాస్‌బుక్ ఆధారంగా రుణమాఫీ అని చెప్పి రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలో చాలామంది రైతులకు రుణమాఫీ కావడం లేదని.. రూ.రెండు లక్షల రుణమాఫీ ప్రతీ రైతుకు కావాలని.. లేనట్లయితే అసెంబ్లీ, సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతు భరోసా యాసంగి పంటకు ఇవ్వలేదని.. ఇప్పుడు వానాకాలం పంటకు కూడా ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. రైతు రుణమాఫీ అసెంబ్లీలో చర్చించకుండానే చేశారు కదా? మరి రైతు భరోసా చెల్లింపులో అసెంబ్లీలో చర్చ దేనికో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎగ్గొట్టడానికి మాత్రమే అసెంబ్లీలో చర్చ ముందుకు తెస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ రైతు, విద్యార్థి, నిరుద్యోగ, ప్రజావ్యతిరేక ప్రభుత్వం అంటూ మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సెన్సేషన్.. 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా టికెట్ల అమ్మకాలు!
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

