చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)లో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్ జోరు కొనసాగిస్తోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అహ్మదాబాద్ 9-6తో యూ ముంబాను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో ముంబా ప్యాడ్లర్ మానవ్ ఠక్కర్ చేతిలో మనుష్ షా ఓడగా ఖ్వాద్రి అరుణ.. లిలియన్ బార్డెట్ను మట్టికరిపించాడు.
కానీ మహిళల సింగిల్స్‌లో అహ్మదాబాద్ ప్లేయర్ రీత్ రిష్య.. సుతిర్థను చిత్తు చేయగా బెర్నడెట్టె మరియ జియావొను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో అహ్మదాబాద్ ద్వయం మనుష్-జాక్స్ చేతిలో మావన్-జియావొ జోడీ పరాభవం పాలవడంతో ముంబాకు పరాభవం తప్పలేదు.