Gukesh | ప్రపంచ చెస్ చాంపియన్‌గా 18 ఏళ్ల గుకేశ్ (Chess Champion Gukesh) అవతరించిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో జరిగిన ఫిడే వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో చైనా క్రీడాకారుడు డింగ్ లిరెన్‌ను ఓడించి అతను విశ్వ విజేతగా నిలిచాడు. ఆ టైటిల్‌ను అందుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సినీ, రాజకీయ, క్రీడా పరిశ్రమల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గుకేశ్‌పై ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) సైతం అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా గుకేశ్‌కు కంగ్రాట్స్ చెబుతూ స్పెషల్ పోస్టు పెట్టారు. ప్రస్తుతం మస్క్ ట్వీట్ వైరల్ అవుతోంది.
Congratulations!
— Elon Musk (@elonmusk) December 14, 2024
Also Read..
“Gukesh Dommaraju | ఆశలు లేని స్థితి నుంచి అద్భుతాన్ని సృష్టించి.. వరల్డ్ చాంపియన్‌గా గుకేశ్”
“Chess Champion Gukesh: ట్రోఫీని టచ్ చేయని ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్.. వీడియో”
“World Chess Champion Gukesh: గుకేశ్‌కు 5 కోట్ల క్యాష్‌ప్రైజ్ ప్రకటించిన సీఎం స్టాలిన్”