సింగపూర్: ప్రపంచ చెస్ చాంపియన్‌గా 18 ఏళ్ల గుకేశ్(Chess Champion Gukesh) అవతరించిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో జరిగిన ఫిడే వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో చైనా క్రీడాకారుడు డింగ్ లిరెన్‌ను ఓడించి అతను విశ్వ విజేతగా నిలిచాడు. ట్రోఫీని అందుకోవడానికి ముందు.. ఆ ట్రోఫీతో ఫోటోషూట్ జరిగింది. చెస్ చాంపియన్ ట్రోఫీతో ఫోటోలు దిగిన గుకేశ్.. ఆ ట్రోఫీ ఇంకా ముట్టుకోలేదు. తనకు ఇప్పుడు ఆ ట్రోఫీని తాకాలన్న ఉద్దేశం లేదన్నాడు. క్లోజింగ్ సెర్మనీ సమయంలో ఆ ట్రోఫీని ఎత్తుకోవాలని ఉందని, అప్పటి వరకు దాన్ని ముట్టుకోవడం లేదని తెలిపాడు.
Photoshoot with the World Champion, Gukesh D 🇮🇳, and his trophy! 🔥🏆
As promised Gukesh did not touch the trophy; he wanted to wait until the closing ceremony! @DGukesh #DingGukesh pic.twitter.com/uclcFWp67c
— International Chess Federation (@FIDE_chess) December 13, 2024
చెస్ ఆడటాన్ని ఎంజాయ్ చేయాలని, ఏదో ఒక రోజు మన కలను సాకారం చేసుకుంటామని గుకేశ్ తన సందేశంలో తెలిపాడు.
“Seeing it up close for the first time… I don’t want to touch it, I want to lift it at the closing ceremony!” 🇮🇳 World Champion Gukesh D about the trophy 🏆#DingGukesh @DGukesh pic.twitter.com/RFybjmXkFl
— International Chess Federation (@FIDE_chess) December 13, 2024