కాబూల్: ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) క్రికెట్ అభిమానులు హద్దులు మీరారు. వేల సంఖ్యలో వీధుల్లో ర్యాలీ తీశారు. టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై నెగ్గిన ఆ జట్టు.. సెమీస్‌లోకి ప్రవేశించింది. ఆ అద్భుత సందర్భాన్ని ఆఫ్ఘన్ క్రీడాభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు. జనం భారీ సంఖ్యలో ర్యాలీ తీస్తున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ బస్సులో వెళ్తున్న ఆఫ్ఘన్ క్రికెటర్లు కూడా పార్టీ చేసుకున్నట్లు కొన్ని వీడియోలు వచ్చాయి. నాన్గర్హర్ పట్టణంలో భారీ సంఖ్యలో క్రికెట్ ప్రేమికులు ర్యాలీ తీశారు.
జీవిత కల నెరవేరినట్లు ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. టోర్నీలో స్టార్ట్ చేసిన తీరు బాగుందని, న్యూజిలాండ్‌ను ఓడించిన తర్వాత తమకు నమ్మకం పెరిగిందన్నాడు. ఆ ఫీలింగ్‌ను వర్ణించే మాటలు లేవన్నాడు. ఈ వికెట్‌పై 135 స్కోరు పర్వాలేదనుకున్నామని, 20 రన్స్ తక్కువే అయినా, ఇదంతా మైండ్‌సెట్‌కు సంబంధించిన ఆట అని రషీద్ తెలిపాడు. ఆఫ్ఘన్ జట్టు సభ్యులపై కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. టీ20 లైనప్ చాలా బలంగా ఉందన్నాడు.
The streets of Nangarhar in Afghanistan. 🤯🇦🇫 pic.twitter.com/MBP7HYTTqA
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024