IND vs PAK : ఆసియా కప్ సూపర్ 4 దశను భారత జట్టు విజయంతో అరంభించింది. లీగ్ దశలో7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని రాబట్టింది. కాకపోతే ప్రత్యర్ధి నుంచి తగ్గ పోటీ ఎదురైంది. అభిషేక్ శర్మ(74) మెరపు అర్ధ శతకంతో రెచ్చిపోగా.. శుభమన్ గిల్(47) బౌండరీల మోత మోగించి గట్టి పునాది వేశారు. మిడిలార్డర్ విఫలమైనా.. తిలక్ వర్మ(30 నాటౌట్) సాధికారిక ఇన్నింగ్స్‌తో పాక్‌కు పరాభవం తప్పలేదు. ఆఫ్రిది ఓవర్లో 93 మీటర్ల సిక్సర్, ఫోర్ బాదిన తిలక్ జట్టుకు విజయాన్ని అందించాడు. మొత్తానికి అభిమానులు కోరుకున్నట్టే దాయాదుల పోరులో మజా వచ్చింది. తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. సూర్యకుమార్ సేన.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మరోసారి ప్రేక్షకులను అలరించింది. లీగ్ దశలో ఏకపక్షంగా గెలుపొందిన టీమిండియాకు ఈసారి పాక్ గట్టి సవాల్ విసిరింది. బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో 172 పరుగుల లక్ష్యాన్ని విసిరింది. కానీ, ఫలితం మాత్రం మారలేదు. భారీ ఛేదనలో పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదేశాడు. 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆయూబ్ వేసిన 6వ ఓవర్లో అభి ఒక ఫోర్.. గిల్ రెండు బౌండరీలతో 14 రన్స్ పిండుకున్నారు. దాంతో. పవర్ ప్లేలో భారత్ వికెట్ కోల్పోకుండా 69 రన్స్ చేసింది. ఆయూబ్ బౌలింగ్‌లో మెరుపు బౌండరీతో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడీ లెఫ్ట్ హ్యాండర్.
𝗔 𝗰𝗹𝗶𝗻𝗶𝗰𝗮𝗹 𝘄𝗶𝗻 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗯𝗮𝗴 𝗶𝗻 #𝗦𝘂𝗽𝗲𝗿𝟰! 🙌#TeamIndia continue their winning run in the #AsiaCup2025! 👏 👏
Scoreboard ▶️ https://t.co/CNzDX2HKll pic.twitter.com/mdQrfgFdRS
— BCCI (@BCCI) September 21, 2025
పాక్ నిర్ధేశించిన భారీ ఛేదనలో భారత ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు. షాహీన్ అఫ్రిది వేసిన తొలి బంతినే ఫైన్ లెగ్ దిశగా సిక్సర్‌గా మలిచాడు అభిషేక్ శర్మ(74 39 బంతుల్లో 6 ఫోర్ల, 5 సిక్సర్లు). అనంతరం శుభ్‌మన్ గిల్(47) సైతం దూకుడుగా ఆడాడు. అబ్రార్ వేసిన నాలుగో ఓవర్లో మిడ్ వికెట్ దిశగా వరుసగా 4, 6 కొట్టగా స్కోర్ 40 దాటింది. రవుఫ్‌ను ఉతికేస్తూ అభిషేక్ బాదగా 28 బంతుల్లోనే ఈ ద్వయం భాగస్వామ్యం 50 రన్స్‌కు చేరింది. చివరి బంతిని గిల్ మెరుపు వేగంతో బౌండరీకి తరలించాడు. వరుస ఓవర్లలో గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) ఔటయ్యారు. అప్పటికీ 57 బంతుల్లో 66 రన్స్ కావాలి.
— BCCI (@BCCI) September 21, 2025
తిలక్ వర్మ, సంజూ శాంసన్(13)లు ఆచితూచి ఆడుతూ..నాలుగో వికెట్‌కు 24 రన్స్ రాబట్టి జట్టును ఆదుకున్నారు. రవుఫ్ ఓవర్లలో శాంసన్ బౌల్డ్ అయ్యాక వచ్చిన హార్దిక్ పాండ్యా (7 నాటౌట్) తొలి బంతినే బౌండరీకి తరలించి జట్టు స్కోర్ 150 దాటించాడు. ఆ తర్వాత ఫహీం బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్సర్ బాదిన తిలక్.. అఫ్రిది వేసిన 19వ ఓవర్లో వరుసగా 6, 4తో భారత జట్టు ఆరు వికెట్ల విజయంలో కీలకమయ్యాడు.
లీగ్ దశలో పాకిస్థాన్‌ను తక్కువకే కట్టడి చేసిన భారత బౌలర్లు సూపర్ 4లో తేలిపోయారు. ప్రధాన పేసర్ బుమ్రా, పాండ్యా.. కుల్దీప్ యాదవ్ విఫలమవ్వగా.. ఫీల్డింగ్‌లోనూ నాలుగు క్యాచ్‌లు జారవిడవడంతో పాక్ బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకున్నారు. ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్(58) అర్ధ శతకంతో చెలరేగగా.. సయీం ఆయీబ్(21) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. శివం దూబే రెండు వికెట్లు తీసి పాక్ జోరుకు కళ్లెం వేశాడు. ఆఖర్లో సల్మాన్ అఘా (17 నాటౌట్) ధనాధన్ ఆడగా పాక్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.