Abhishek Sharma : ఐపీఎల్ 17వ సీజన్లో పరుగుల వరద పారించిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) దేశం తరఫున ఉసూరుమనిపించాడు. జింబాబ్వే పర్యటనతో టీ20ల్లో అరంగేట్రం చేసిన అభిషేక్ ‘డకౌట్’ అయ్యాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్లో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఈ యంగ్‌స్టర్ ఖాతా తెవరకుండానే పెవిలియన్ చేరాడు.
బ్రియాన్ బెన్నెట్ బౌలింగ్‌లో నాలుగు బంతులు ఎదుర్కొని సున్నాకే ఔటయ్యాడు. దాంతో, టీ20 అరంగేట్రం మ్యాచ్‌లోనే డకౌట్ అయిన నాలుగో భారత ఆటగాడిగా అభిషేక్ రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ కంటే ముందు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni), కేఎల్ రాహుల్(KL Rahul), పృథ్వీ షా(Prithvi Shaw)లు అరంగేట్రంలోనే సున్నా చుట్టేశారు.
పృథ్వీ షా, కేఎల్ రాహుల్
తొలి టీ20లో జింబాబ్వే నిర్దేశించిన 115 పరుగుల ఛేదనలో అభిషేక్ శర్మ ఓపెనర్‌గా వచ్చాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(31)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన అతడు.. తొలి ఓవర్లోనే డకౌట్ అయి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో డెబ్యూ చేసిన రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(6)లు సైతం స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.
Four ball duck for Abhishek Sharma on his debut. pic.twitter.com/ekCWVAfz7K
— Johns. (@CricCrazyJohns) July 6, 2024
పేసర్ తెండాయ్ చతర, సారథి సికిందర్ రజాలు మూడేసి వికెట్లు తీయడంతో భారత జట్టు 102 పరుగులకే ఆలౌటయ్యింది. దాంతో, టీ20ల్లో టీమిండియాపై అత్యల్ప స్కోర్‌ను కాపాడుకున్న జట్టుగా జింబాబ్వే చరిత్ర సృష్టించింది.
This one will sting Shubman Gill’s young side 🇮🇳 pic.twitter.com/pmxLx4neOM
— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2024