సిడ్నీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదిక(Melbourne Cricket Ground)గా జరిగిన నాలుగవ టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లో ముగియడం పట్ల విమర్శలు వస్తున్నాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆ పిచ్‌పై నివేదిక ఇచ్చింది. ఎంసీజీ పిచ్ అసంతృప్తికరంగా ఉన్నట్లు ఐసీసీ తన రేటింగ్‌లో పేర్కొన్నది. దీనితో పాటు ఆ వేదికకు ఓ డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. ఐసీసీ పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్‌లో భాగంగా ఆ నివేదిక వెల్లడించారు.
ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానల్ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ .. మెల్బోర్న్ పిచ్‌పై నివేదిక ఇచ్చారు. ఎంసీజీ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉందని, తొలి రోజు 20 వికెట్లు పడ్డాయని, ఇక రెండో రోజు 16 వికెట్లు కూలినట్లు నివేదికలో చెప్పారు.ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయినట్లు పేర్కొన్నారు. మార్గదర్శకాల ప్రకారం పిచ్ అసంతృప్తికరంగా ఉందని, వేదికకు ఓ డీమెరిట్ పాయింట్ ఇస్తున్నట్లు తన రిపోర్టులో జెఫ్ క్రోవ్ తెలిపారు.
Match referee Jeff Crowe hands down verdict on the MCG pitch used for the Boxing Day Test 👀#WTC27 | #AUSvENG
https://t.co/YdKIf8RBQu— ICC (@ICC) December 29, 2025