నార్నూర్, డిసెంబర్ 29 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత పాటించేలా చూడాలని గాదిగూడ ఎంపీడీవో శ్రీనివాస్ సదరు కాంట్రాక్టర్ లకు సూచించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జుని గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు తమ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం చేయకుండా చూడాలన్నారు. ఇండ్ల నిర్మాణంలో నాణ్యమైన ఇసుకను వాడేలా చూడాలని గుత్తేదారులకు ఆదేశించారు. అలాగే పనులు వేగవంతం చేసి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కమల, మాజీ సర్పంచ్ కాను, పంచాయతీ కార్యదర్శి రవి, లబ్ధిదారులు ఉన్నారు.