అమరావతి : వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి పునర్వినియోగిస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమించవచ్చని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటుచేసిన ప్రదర్శనను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్ల నుంచి రాలే ఆకులను, కొమ్మలను, పొడి చెత్తను ఊడ్చిన తరువాత తగులపెట్టడం కంటే కంపోస్టు (Compost) గా మారిస్తే ఎరువుగా ఉపయోగ పడుతుందని అన్నారు. స్థానిక సంస్థలకు వ్యర్థాలు, పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు. సమాజంలో కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ తన వంతుగా గుర్తించాలని సూచించారు. మొక్కలను నాటడం, చెట్లను కాపాడాలని కోరారు.